శ్రీ శివ
శ్రీకంఠ! నాగభూషణ!
చీకాకుల ద్రుంచునట్టి చిన్మయరూపా!
లోకాల నేలు చుండెడి
శ్రీకర! ప్రణతులను నీకు చేసెదను శివా! ౧.
నీవే లోకాధీశుడ
వీవే సర్వార్థదాత వీవే ప్రజకున్
భావావేశము గూర్చెద
వీవే తండ్రులకు దండ్రి విమ్మహిని శివా! ౨.
నీయాన బూని బ్రహ్మయు
నీయాజ్ఞను గొనుచు హరియు నిఖిల జగాలన్
చేయుచు నుందురు కృతులను
నీయాజ్ఞయె దాల్తు రెల్ల నిర్జరులు శివా! ౩.
శిరమున గంగను, చంద్రుని
నురమున సర్పములు, పుర్రె లుత్సవ మనుచున్
సురుచిర సౌఖ్యము లొసగుచు
ధరవారిని గావ నీవు దాల్చెదవు శివా! ౪.
సురగణము కోరినంతట
నిరుపమగతి విషము నపుడు నిష్ఠాగరిమన్
సరియంచు ద్రావినాడవు
స్మరహర! నినె గొల్తునయ్య! సతతంబు శివా! ౫.
జల మించుక గొని హర! నీ
తలపై చల్లియును బిల్వ తరుపత్రాలన్
నిలిపిన వారల కిలలో
నలఘు సుఖంబులను గూర్తు వనుదినము శివా! ౬.
ఆకాశంబున దిరుగుచు
చీకాకులు మహిని గల్గ చేసెడి వారిన్
పోకార్చి ద్రుంచినాడవు
ప్రాకటముగ నాడు, గొనుము ప్రణతులను శివా! ౭.
తల్లివి నీవై సతతం
బెల్ల జగంబులను గాతు వేవిధి జూడన్
ఫుల్లాబ్జనేత్ర! శంకర!
సల్లలితానందసుఖద! సకలస్థ! శివా! ౮.
శిరముం గన్నులు వదనము
కరచరణాదులును నాదు కన్నులు తనువున్,
పురహర! నిను సేవించుటకే
నిరతము నిను గొల్చు బుద్ధి నీవొసగు శివా! ౯.
అభిషేకప్రియ! శంకర!
శుభవరదాయక! శుభాంగ! సుందరమూర్తీ!
విభవంబు లొసగు దేవర!
యభయం బొసగుచును గావు మనుదినము శివా! ౧౦.
అరుసంబున నీనామము
నిరతము స్మరియించువారి నిఖిలాఘంబుల్
కరుణామయ! నశియించును
ధరపయి ప్రమథాధినాథ! తథ్యంబు శివా! ౧౧.
అరుసంబున నీనామము
నిరతము స్మరియించువారి నిఖిలాఘంబుల్
కరుణామయ! నశియించును
ధరపయి ప్రమథాధినాథ! తథ్యంబు శివా! ౧౧.
(సురుచిరమౌ మోక్షపదము )
వేదంబులు నీమహిమను
మోదంబున బల్కుచుండు మునిసంఘంబుల్
శ్రీదుండని కొనియాడుదు
రాదియు నంతంబులేని యాద్యుడవు శివా! ౧౨.
శివ! శంకర! అభయంకర!
భవబంధవిమోచనోగ్ర! భక్తాధీనా!
ధవళాచలగేహా! ఘన
నవనిధిసౌభాగ్యదాత! ననుగావు శివా! ౧౩.
నీవెవ్వని యోగ్యునిగా
భావింతువొ వాని కిలను బహు సంపదలన్
దీవించి యొసగుచుండెద
వేవేళను సన్నుతింతు నేనికను శివా! ౧౪.
నిన్నే నమ్మితి కావుము
మిన్నేటిని తలను దాల్చి మేదిని లోనన్
మన్నిక నఘసంహారము
సన్నుతముగ చేయు దేవ! సర్వేశ! శివా! ౧౫.
శివరాత్రిని నిను గొల్చెడి
భువివారల కభయ మొసగి పోపొమ్మనుచున్
జవమున నఘసంఘంబుల
నవతలికిం ద్రోచివేతు వద్భుతము శివా! ౧౬
నిను నమ్మి పట్టు వీడని
ఘనగుణుడైనట్టి వాని కడు వత్సలతన్
మునిబాలుని చిరజీవిగ
మును చేసితి వౌర! నాడు ముదమంద శివా! ౧౭.
కరిరాజవరద! శంకర!
కరిముఖసన్మానదాత! కరుణాపూర్ణా!
నిరతానందద! సురవర!
సరియగు భావంబు లొసగ సన్నుతులు శివా! ౧౮.
భోళాశంకర! శుభకర!
కూళల బరిమార్చు నట్టి కోరిక తోడన్
వ్యాళములు దాల్చి యీ భూ
గోళమున న్నిలుచు నిన్ను గొలిచెదను శివా! ౧౯.
బూడిద గాదీ చూర్ణము
పోడిమి సమకూర్చునట్టి పుణ్యప్రదమౌ
సూడిద గావున దాల్చుచు
వేడెద నాయఘము గాల్చి వేయంగ శివా! ౨౦.
మారేడున మూడాకులు
నీరేజాక్షాప్తమిత్ర! నీ నేత్రమ్ముల్
తీరుగ మూడే కావున
నీరీతిగ వానినందు మీశాన! శివా! ౨౧.
పండ్రెండు పేర్ల నందుచు
గుండ్రాతిగ రూపు దాల్చి గొలిచిన యెడలన్
తండ్రీ! వరముల నిత్తువు
పుండ్రాభశరీర! నిన్ను పూజింతు శివా! ౨౨.
ఏ మాయ చేసినాడవొ
భూమి న్నినుగాక యొరుని పొందనటంచున్
నీమంబున నా శైలజ
స్వామీ! గాటంపు తపము సల్పినది శివా! ౨౩.
శివరాత్రిని నిను గొల్చెడి
భువివారల కభయ మొసగి పోపొమ్మనుచున్
జవమున నఘసంఘంబుల
నవతలికిం ద్రోచివేతు వద్భుతము శివా! ౧౬
నిను నమ్మి పట్టు వీడని
ఘనగుణుడైనట్టి వాని కడు వత్సలతన్
మునిబాలుని చిరజీవిగ
మును చేసితి వౌర! నాడు ముదమంద శివా! ౧౭.
కరిరాజవరద! శంకర!
కరిముఖసన్మానదాత! కరుణాపూర్ణా!
నిరతానందద! సురవర!
సరియగు భావంబు లొసగ సన్నుతులు శివా! ౧౮.
భోళాశంకర! శుభకర!
కూళల బరిమార్చు నట్టి కోరిక తోడన్
వ్యాళములు దాల్చి యీ భూ
గోళమున న్నిలుచు నిన్ను గొలిచెదను శివా! ౧౯.
బూడిద గాదీ చూర్ణము
పోడిమి సమకూర్చునట్టి పుణ్యప్రదమౌ
సూడిద గావున దాల్చుచు
వేడెద నాయఘము గాల్చి వేయంగ శివా! ౨౦.
మారేడున మూడాకులు
నీరేజాక్షాప్తమిత్ర! నీ నేత్రమ్ముల్
తీరుగ మూడే కావున
నీరీతిగ వానినందు మీశాన! శివా! ౨౧.
పండ్రెండు పేర్ల నందుచు
గుండ్రాతిగ రూపు దాల్చి గొలిచిన యెడలన్
తండ్రీ! వరముల నిత్తువు
పుండ్రాభశరీర! నిన్ను పూజింతు శివా! ౨౨.
ఏ మాయ చేసినాడవొ
భూమి న్నినుగాక యొరుని పొందనటంచున్
నీమంబున నా శైలజ
స్వామీ! గాటంపు తపము సల్పినది శివా! ౨౩.
శిరమున
సురనిమ్నగ నిక
సరసంబుగ
తనువునందు శైలజ నటులే
యురగంబులు
కంఠంబున
సురుచిరగతి
దాల్చినావు శోభనము శివా! ౨౪.
నీకొసగిన
నాల్గాకులు
మాకిచ్చెద
వెల్లసిరుల ముము గావంగా
శ్రీకంఠ!
చేరియుండెద
వేకాలం
బెదలలోన నీశాన! శివా! ౨౫.
సోమేశుడ
వొకచోటను
భీమేశుడ
వొక్కచోట విశ్వేశుడవై
కామేశ!
నిలిచియుందువు
భూమిన్
మము బ్రోచు కొఱకు పురవైరి!శివా! ౨౬.
జాగేల
మ్మమ్ము గావగ
రోగావృతమయ్యె
జగతి రుద్ర! మహేశా!
ఆగణనాయకునైనను
మా
గాసి యణంగద్రొక్కు మనరాదె శివా! ౨౭.
స్వార్థంబు
పెరిగి పోయెను
తీర్థంబుల
కలుషితంబు స్థిరమయి యుండెన్
వ్యర్థంబగు
కలహంబుల
నర్థాలకు
తావులయ్యె నరయంగ శివా! ౨౮.
పరభాషలు
పరమతములు
పరసంస్కృతు
లన్నిచేరి భారతభువిపై
నిరతము
నాట్యంబాడుచు
నురుతరముగ
భీతి గొల్పుచుండినవి శివా! ౨౯.
అలసత్వమొ
జనములలో
కలియుగ
కారణమొ మేటి కలుషంబులకున్
తెలియదు
భారతవర్షం
బలఘు
యశంబులను పొంద నగునేమి శివా! ౩౦.
No comments:
Post a Comment