ది. 08-04-2012 వ తేదీనాడు శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన "భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్" అనే సమస్యకు గురుతుల్యులు శ్రీ నేమాని పండితులవారు "శ్రీమదుమామహేశ్వరికి" అంటూ చేసిన రచన అత్యద్భుతంగా ఉంది. కవిత్వమంటే ఇలా ఉండాలనిపించేలా అలనాటి అల్లసాని పెద్దనగారి ఉత్పలమాలికను తలపించింది. ఈ సందర్భంగా వారికి శతాధిక అభివాదాలతో
నేమాని పండితార్యుల
నామార్చన మద్భుతంబు, నరులందరికిన్
కామితసుఖఫలదాయక
మై మోదములందజేసి యఘముల బాపున్.
మీమాటలు మంత్రములై
మా మా హృదయాలుదాకి మైమరపించెన్
నేమాన్యన్వయజాతా!
శ్రీమాతయె మీకు గూర్చు సిరులు యశంబుల్. - ఆర్యా!
నమస్కారములు,
ఆలస్యంగా మీ "శ్రీరామ మానస పూజ" చదవడం జరిగింది.
మహదానందముగా నున్నది.
శ్రీరామ రామ యన్నను
ఘోరాఘములెల్ల బాయు కువలయమందున్
నోరారగ నారాముని
మీ రోకవివర్య! దలచి మించిరి కవులన్.
మీ "మానసపూజన"మిది
నేమానిబుధాగ్రగణ్య! నిత్యస్తవమై
భూమిని వెలుగును సత్యము
శ్రీమన్! గురువర్య! మీకు చేతును ప్రణతుల్. -
మా శ్రీరామ మానస పూజ గురించి ఆనందమను గొలుపు వ్యాఖ్యలను వ్రాసిన శ్రీ కంది
శంకరయ్య గారికి శ్రి హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి శుభాశీస్సులు.
శ్రీ హరి వారూ! మీరు విజయనగరము జిల్లాలో ఎక్కడ నుంటున్నారో మాకు తెలియజేయండి. నా విలాసములు:
ఫోను: 0891 - 2565944 / 9440233175
మీ ఫోను పిలుపుకై ఎదురు చూచుచుంటాను.
స్వస్తి.
ది.13.04.2012 వతేదీ "శంకరాభరణం" బ్లాగులో ప్రచురితమైన "గజేంద్రుని ఆర్తి" అను పద్యరచనకు స్పందిస్తూ రచయిత్రి "లక్ష్మీ దేవి" గారిని ఉద్దేశిస్తూ-
హరికథలను పల్కుటచే
హరి, లక్ష్మీదేవి! మీకు ననవరతంబున్
సిరులిచ్చి బ్రోచు నెల్లెడ
వరమగు సద్యశము లింక వైభదీప్తుల్.
ది.15.04.2012 వతేదీ శంకరాభరణం బ్లాగులో ప్రచురితమైన "భారతరత్న-అంబేడ్కర్" అను స్వరచిత పద్యములకు పెద్దలైన కవిమిత్రుల స్పందనలకు ప్రతిస్పందిస్తూ-
ఘనులౌ కవివరులారా!
వినమితవిద్యార్థి నేను, విజ్ఞులు మీరల్
ప్రణతిశతంబును చేకొను
డనయము వత్సలత నిచ్చు నభినందనకున్.
"ఈశ్వరేచ్ఛ" పద్యాలు చదివి పండిత శ్రీ నేమాని వారొసగిన యాశీస్సులకు బదులుగా
శుభములు గూర్చుచు నుండెడి
యభినందనలిచ్చుచుందు రస్మద్గురుస
న్నిభులౌ పండితవర్యా!
అభివాదశతంబు జేతు నయ్యా మీకున్.
ది. 24.04.2012 వ తేదీ నాటి చిత్రవ్యాఖ్య పద్య రచనకు శ్రీ నేమాని వారు వ్రాసిన మహాస్రగ్ధరను గూర్చి
బహురమ్యం బీస్రగ్ధర
యహహా! నేమానివర్య! అతిమథురంబై,
మహితాద్భుతసత్పదగుణ
సహితంబై వెలుగుచుండె సత్కవివినుతా!
కాళిదాసుఁ గూర్చి కథలున్నవెన్నియో
అందు నొక్కదాని కద్భుతముగ
పద్యరూపమిచ్చి హృద్యంబుగా బల్కు
శంకరార్య! మిమ్ము సన్నుతింతు
కాళిదాసుఁ గూర్చి కథలున్నవెన్నియో
అందు నొక్కదాని కద్భుతముగ
పద్యరూపమిచ్చి హృద్యంబుగా బల్కు
శంకరార్య! మిమ్ము సన్నుతింతు
శ్రీమన్మిస్సనవర్యా!
మీమాటలు మల్లెలట్లు మిక్కిలి సొగసై
ధీమన్! వెలుగుచు నున్నవి
కామితవరదుండు మీకు ఘనయశమొసగున్.
సిరిఁ గోరని వారొక్కరు
నరయగ భువిపైన పండితార్యా! గలరా?
పరమానందం బాశీ
ర్భరితవచస్సులకు, మీకు ప్రణతులొనర్తున్.
మీమాటలు మల్లెలట్లు మిక్కిలి సొగసై
ధీమన్! వెలుగుచు నున్నవి
కామితవరదుండు మీకు ఘనయశమొసగున్.
సిరిఁ గోరని వారొక్కరు
నరయగ భువిపైన పండితార్యా! గలరా?
పరమానందం బాశీ
ర్భరితవచస్సులకు, మీకు ప్రణతులొనర్తున్.
వాత్సల్యము ప్రకటించుచు(గురిపించుచు)
సత్సంగము గూర్చినారు శంకరవర్యా!
ఉత్సాహము జనియించుచు
సత్సౌఖ్యము లబ్బుచుండె చాలిక నాకున్.
"కంది శంకరార్య! వందనంబులు మీకు
సకలశుభములొసగి చక్కనైన
స్వాస్థ్యమందజేసి సర్వేశ్వరుండెల్ల
వేళలందు బ్రోచు విజ్ఞ! మిమ్ము".
రెంతో చక్కగ జేయుచుండిరి భళీ! యీ కార్య మాంధ్రావనిన్
సంతోషంబిక నందజేయగలదో సన్మానపాత్రా! యశ:
కాంతాసంగతి మీకు గల్గు ననిలాఖ్యా! సర్వసౌఖ్యంబులున్.
సర్వలోకైకమాతయై జగతినేలు
రాజరాజేశ్వరీదేవిరమ్యచరిత
మంద మొప్పంగ వర్ణించి యనఘులైన
పండితార్యుల కొనరింతు ప్రణతులేను.
సత్సంగము గూర్చినారు శంకరవర్యా!
ఉత్సాహము జనియించుచు
సత్సౌఖ్యము లబ్బుచుండె చాలిక నాకున్.
"కంది శంకరార్య! వందనంబులు మీకు
సకలశుభములొసగి చక్కనైన
స్వాస్థ్యమందజేసి సర్వేశ్వరుండెల్ల
వేళలందు బ్రోచు విజ్ఞ! మిమ్ము".
20.10.2012 నాటి శ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారి అంతర్జాల అష్టావధానమును గూర్చి
అంతర్జాలమునుండి మాడ్గులకవీ! యష్టావధానంబు మీరెంతో చక్కగ జేయుచుండిరి భళీ! యీ కార్య మాంధ్రావనిన్
సంతోషంబిక నందజేయగలదో సన్మానపాత్రా! యశ:
కాంతాసంగతి మీకు గల్గు ననిలాఖ్యా! సర్వసౌఖ్యంబులున్.
21.10.2012 నాటి శ్రీ నేమానివారి
శ్రీరాజరాజేశ్వరీ స్తుతి పద్యమును గూర్చి
సర్వలోకైకమాతయై జగతినేలు
రాజరాజేశ్వరీదేవిరమ్యచరిత
మంద మొప్పంగ వర్ణించి యనఘులైన
పండితార్యుల కొనరింతు ప్రణతులేను.
"శంకరాభరణం" బ్లాగులో వ్రాసిన వివిధ రచనలకు కవిమిత్రులు స్పందించి అందించిన అభినందనలు.
శ్రీ నేమాని పండితులవారు :
కరమాదరమున నంబేడ్
కరు భారతరత్నవరుని ఘనచరితము శ్రీ
కరముగ వర్ణించిన కవి
వరు నభినందింతు మూర్తి ప్రజ్ఞాశాలిన్.
హరికులశశి మూర్తీజీ!
పరువెత్తును మీకలమ్ము భావము వెనుకే
విరబూయు పద్యసుమములు
మురిపించును పద్యప్రియుల ముచ్చటలగుచున్.
సిరులొప్పారెడు పావనస్థలి కురుక్షేత్రంబు హర్యాణ నా
బరగున్ వేల్పుల కాలవాలమయి సద్భావమ్ముతో క్రీడికిన్
హరి బోధించెను గీత గూర్చె జయ మాహ్లాదమ్మునున్ గూర్చు సుం
దర దృశ్యంబుల పెన్నిధానమది యుత్సాహంబుతో కాంచుడీ
అని వర్ణించెను కడు క
మ్మని పద్యమ్ములను వ్రాసి మాన్యుడు ధన్యుం
డును సఖుడు మూర్తి యాతని
కొనియాడుచు దీవెనలను గూర్తును వేడ్కన్
సిరులొప్పారెడు పావనస్థలి కురుక్షేత్రంబు హర్యాణ నా
బరగున్ వేల్పుల కాలవాలమయి సద్భావమ్ముతో క్రీడికిన్
హరి బోధించెను గీత గూర్చె జయ మాహ్లాదమ్మునున్ గూర్చు సుం
దర దృశ్యంబుల పెన్నిధానమది యుత్సాహంబుతో కాంచుడీ
అని వర్ణించెను కడు క
మ్మని పద్యమ్ములను వ్రాసి మాన్యుడు ధన్యుం
డును సఖుడు మూర్తి యాతని
కొనియాడుచు దీవెనలను గూర్తును వేడ్కన్
హరివంశోధధి పూర్ణచంద్రనిభ తేజా! సత్యనారాయణా!
పరమాదర్శము నీ గుణోన్నతి సదా వాణీపదాబ్జార్చనా
నిరతా! సర్వసుఖమ్ములన్ గనుచు సందీపించుమా నూరు వ
త్సరముల్ నీ యిలవేల్పు నీ కొసగుతన్ సౌభాగ్య పర్వమ్ములన్.
బాల్యదశ గూర్చి యెనిమిది పద్యములను
చక్కగా విరచించిన సత్కవీశ!
హరివరాన్వయ చంద్ర! నిన్నభినుతింతు
బాల్యదశ వినిర్మలము నమూల్యము కద
సిరియేకద దాని గూర్చి చెప్పెడు వేళన్
పరవశమొందెదరు కదా
పరువెత్తును వారి కలము బలె రూపాయీ!
నరయగ భువిపైన పండితార్యా! గలరా?
పరమానందం బాశీ
ర్భరితవచస్సులకు, మీకు ప్రణతులొనర్తున్.
చక్కగా విరచించిన సత్కవీశ!
హరివరాన్వయ చంద్ర! నిన్నభినుతింతు
బాల్యదశ వినిర్మలము నమూల్యము కద
రూపాయిని గూర్చి వ్రాసిన పద్యములకు శ్రీనేమానివారి స్పందన
హరివారికి ప్రియమైనదిసిరియేకద దాని గూర్చి చెప్పెడు వేళన్
పరవశమొందెదరు కదా
పరువెత్తును వారి కలము బలె రూపాయీ!
ప్రతిస్పందన
సిరిఁ గోరని వారొక్కరునరయగ భువిపైన పండితార్యా! గలరా?
పరమానందం బాశీ
ర్భరితవచస్సులకు, మీకు ప్రణతులొనర్తున్.
శ్రీ మిస్సన్న గారు:
భరతమాత సుతుని భారతరత్నమున్
ముచ్చటైన పద్యములను నిలిపి
వారికిచ్చి ఘననివాళులు భక్తితో
మించి నారు మూర్తి మేలు మేలు.
గీత పుట్టినిల్లు క్రీడి క్రీడాంగణ
మాప గాత్మజునకు నమర ధాత్రి
కౌరవాధములకు కడపటి తావును
కనుల గట్టు రీతి ననిరి మూర్తి.
గీత పుట్టినిల్లు క్రీడి క్రీడాంగణ
మాప గాత్మజునకు నమర ధాత్రి
కౌరవాధములకు కడపటి తావును
కనుల గట్టు రీతి ననిరి మూర్తి.
21.10.2012 నాటి శ్రీ నేమానివారి
శ్రీరాజరాజేశ్వరీ స్తుతి పద్యమును గూర్చి వ్రాసిన పద్యమునకు
శ్రీ నేమాని వారి ఆశీస్సులు
హరి వంశ్యు మూర్తి కవివరు
కరుణామృత దృష్టి గనుచు కామిత మిడుచున్
పరమేశ్వరి ప్రోచుత యని
సరసోక్తుల తోడ నాశిషములను గూర్తున్
కరుణామృత దృష్టి గనుచు కామిత మిడుచున్
పరమేశ్వరి ప్రోచుత యని
సరసోక్తుల తోడ నాశిషములను గూర్తున్
శంకరాభరణం బ్లాగు నిర్వాహకులు శ్రీ కంది శంకరయ్యగారిని ప్రశంసిస్తూ
కందివంశజాత! వందనంబులు మీకు
సత్కవీంద్ర! మాన్య! శంకరార్య!
సర్వహితముగోరి శంకరాభరణంబు
నడుపుచున్న మీకు నతులొనర్తు.
నిత్యపద్యరచన నిష్ఠగా జేయించ
దలచి మమ్ముబోంట్ల బిలిచి సతము
పద్యపంక్తు లిచ్చి హృద్యంపువ్యాఖ్యలు
చేయు మీకు నతులు చేతునార్య!
ఎన్నిపనులు నిత్య మున్నను వాటిని
ప్రక్కనుంచి ముందు పద్యరచన
ముఖ్యమని దలంచి ముందొక పంక్తిని
మాకు నొసగు చుండు మాన్య! నతులు.
ఆపకుండ సతత మారోగ్యమునుగూడ
లెక్క చేయకుండ మిక్కిలిగను
ఉత్సహించి మాకు నుత్సాహమును బంచు
చుండు శంకరార్య! దండ మందు.
యతులు ప్రాస లరసి యత్యద్భుతంబుగా
నిట్లు మిత్రులంద రెల్ల వేళ
కవిత లల్లుటకును కారకులైనట్టి
శంకరార్య! మిమ్ము సన్నుతింతు.
సత్కవీంద్ర! మాన్య! శంకరార్య!
సర్వహితముగోరి శంకరాభరణంబు
నడుపుచున్న మీకు నతులొనర్తు.
నిత్యపద్యరచన నిష్ఠగా జేయించ
దలచి మమ్ముబోంట్ల బిలిచి సతము
పద్యపంక్తు లిచ్చి హృద్యంపువ్యాఖ్యలు
చేయు మీకు నతులు చేతునార్య!
ఎన్నిపనులు నిత్య మున్నను వాటిని
ప్రక్కనుంచి ముందు పద్యరచన
ముఖ్యమని దలంచి ముందొక పంక్తిని
మాకు నొసగు చుండు మాన్య! నతులు.
ఆపకుండ సతత మారోగ్యమునుగూడ
లెక్క చేయకుండ మిక్కిలిగను
ఉత్సహించి మాకు నుత్సాహమును బంచు
చుండు శంకరార్య! దండ మందు.
యతులు ప్రాస లరసి యత్యద్భుతంబుగా
నిట్లు మిత్రులంద రెల్ల వేళ
కవిత లల్లుటకును కారకులైనట్టి
శంకరార్య! మిమ్ము సన్నుతింతు.
No comments:
Post a Comment