Sunday, 18 March 2012

ఉగాది పర్వం

శ్రీనందననామ సంవత్సర ఉగాది.
శ్రీ నందనకు స్వాగతము
"పద్య నవరత్న మాలిక"
ఛందము- కందము
శ్రీదంబై సర్వజనా
   మోదంబై "నందనంబు" మునుపటి కంటెన్
   మోదంబులు, సౌఖ్యంబులు
   మేదినిపై నింపవలయు మించు యశంబుల్.
"నందన" వత్సరమంతట
   సుందరతన్ వెలుగ వలయు శుభసంతతితో
   నందనవన తుల్యములై
   యందరికిక జీవనంబు లఖిలజగానన్.
యయును, శాంతము, సత్యము
   భయరహితత, సాధుచరిత బహుసుగుణంబుల్
   రయమున మనముల నిండగ
   జయసిద్ధులు "నందనా"న జనులకు గల్గున్.
దులన్నియు సుజలములై
   యదనున సద్వృష్టి గల్గి యనవరతంబున్
   పదనుగ సస్యములందగ
   మదిలో సంతుష్టి గూడు మరి "నందన"లోన్. 
కువలయ మంతట నిండిన
   యవినీతుల నణగద్రోచు యాత్మబలంబుల్
   వివిధోత్సాహాత్మకమగు
   నవభావము లందవలయు "నందన"మందున్.
స్వాయత్తములౌ సిద్ధులు
   న్యాయము, ధర్మంబు, సత్త్వమంతట నిండున్
   ధ్యేయంబుల మేటిదియగు
   హాయనమౌ "నందనా"న నద్భుత రీతిన్. 
మనము సన్మార్గముకై
   రమణీయత వాక్కులందు రాజిల్లవలెన్
   సమతా దృక్పథమలవడి
   మమకారము నిండవలయు మన"నందన"లోన్. 
నువులు పరిశుద్ధములై
   మనుజులలో నిండవలయు మంజుల భావాల్
   మనమున సౌభ్రాతృత్వం
   బనవరతము "నందనా"న నమరగ వలయున్.
మునిజన జన్మస్థానం
   బనిశము దారుఢ్యమంది యఖిలజగానన్
   మన సుందరభారత మిక
   ఘనకీర్తుల నందవలయు కన "నందన" లోన్.   
                      అందరికీ "శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు"
                                                                                                 
హ.వేం.స.నా.మూర్తి.

శ్రీ చిత్రభాను ఉగాది
శ్రీ చిత్రభానుకు స్వాగతము.

శ్రీ హరి యాముకుందుడిల చిన్మయ రూపము దాల్చి భక్త సం
దోహ మనోరథంబులను దోడ్తన దీర్చుచు నుండు నెప్డు సం
దేహ మొకింత లేదికను, దివ్య సుఖంబుల నంద జేయ నో
స్నేహిల! "చిత్రభాను"! విను, శీఘ్రము రమ్మిదె స్వాగతమ్మిలన్. 

చిరుత ప్రాయములోని పల్లవములన్ సేవించి తామామనిన్
సరసంబౌ సుమనోహరత్వనవవర్షారంభ సద్గీతికల్
ధరనిండం బికబృందముల్ ముదముతో తాదాత్మ్యతం బాడగా
సిరులొల్కంగను రాగదోయి ఘనతన్ "చిత్రా"! శుభాకారతన్. 

త్రయ్యంబకు డా శంకరు
డయ్యాదిమదేవు డజుడు నఖిలంబునకున్
నెయ్యము, సౌఖ్యము లొసగగ
కయ్యంబుల రూపుమాప ఘనముగ రమ్మా! 

భాగ్యరేఖల నిండిన భరతభువిని
స్వర్గతుల్యము సేయుదు సంఘటించి
యనుచు నేతెంచు నూతన హాయనంబ!
వేగరమ్మింక నీకిదె స్వాగతమ్ము.

నుతుల నొనర్తు నీకికను నూతన వత్సరరాజ! నీవు సం
తత సుఖకాములౌ ప్రజకు ధర్మము, శాంతము, నిత్య సత్యసం
ధత, యుపకారవర్తనము, ధైర్యము లందగజేసి వారిలో
నతులితభావనాబలము(పటిమ) నందముగా నిక గల్గజేయుమా. 

కువలయంబులోని కుమతంబులన్నియు
తొలగి పోవవలయు దూరముగను
"చిత్రభాను"! నీదు శ్రీకరమైనట్టి
రాకచేత నింక రయము తోడ. 

స్వాగతాంజలి గొను నూత్నవత్సరంబ!
తిక్తతింత్రిణీ మధుర సంయుక్తమగుచు
మేటి పంచాంగ పఠనాల మేమొసంగు(గ)
సకల కల్మషహరమైన సుకృతికాంక్ష. 

తవైషమ్యలన్ని పోయి జనులున్ కారుణ్య సందీప్తతన్
సతతంబున్ సఖులై మెలంగుచును రోషావేశముల్ వీడి, సం
తత సౌఖ్యంబులు గాంచగా వలెను "చిత్రా!" "భాను"! నీరాకచే
వెతలింకేటికి? నీదు వర్తనము విశ్వవ్యాప్తమై వెల్గగాన్. 

ల్లి దండ్రి యన్న ధరలోని జనులకు
గౌరవాదరంబు కలుగ వలయు,
"చిత్రభాను"లోన పుత్రులపై ప్రేమ
కురియుచుండ వలయు విరివిగాను. 

మునులు పుట్టినిల్లు మోక్షదాయకమైన
భరతభూమి లోన సిరులు నిండి
కామితములు దీరి సేమంబు గలుగంగ 
చేయ వలయు నింక, "చిత్రభాను"!

శ్రీ సుభాను ఉగాది
"శ్రీ సుభానుకు స్వాగతము"
పద్యనవరత్నమాలిక

శ్రీలిట పండుచున్ సకలసిద్ధుల ప్రాప్తియు నీ సుభానులో
మేలగు దౌత్యవర్ధనము మించ విదేశసహోదర దేశరాజితో
తాలిమి, మిత్ర భావనము, ధన్యతనందిన జీవనంబు లే
వేళను భారతీయులకు విస్తృత కీర్తులు గల్గగావలెన్. 

సురుచిరమైన చైత్రమున చూతకిసాలపు భక్షణంబునన్
సరస మనోజ్ఞ మాధుర రసంబుల కోయిల కూయుచుండగా
విరచిత సత్కవిత్వ మధువీచిక దేలెడు మందగామి సుం
దరము సుభాను వచ్చినది దానికి స్వాగతపద్యమాలికల్. 

భాసుర భాగ్యరేఖలవి భారతమందు సుభానులోన నా
యాసమొకింత లేకిచట హైందవ ముస్లిముసోదరత్వముల్
మోసులువారగా వలయు, మోదము నిండ హృదంతరమ్ములో
వాసిగ సాధుభావనల వైభవదీప్తులు వెల్గగా వలెన్. 

నుతజపూరితంబగుచు నూతనసౌఖ్యసమూహమెల్లెడన్
సతతము నాంధ్ర దేశమున సస్యసువర్ధన మీ సుభానులో
కతిపయ విఘ్నసంతతుల కాలము చెల్లగ మూడుపూవులం
దతులిత శోభనంబగుచు నారగు కాయలు గాచుగావుతన్. 

కువలయమందు నెల్లెడల కూర్ములపేర్ముల దర్శనంబులున్
నవయుగ కల్పనా భరితనైష్ఠిక కర్మము లీ సుభానులో
నవిరళ ధాన్యవృద్ధులు ననామయమానవజీవనంబులున్
వివిధములైన సంపదలు విశ్వమునంతట పండగా వలెన్. 

స్వాగతమో సుభాను! సుమభాసురదివ్యమనోజ్ఞరూపివై
వేగము రమ్ము, భారతము విస్ఫుటవైభవదీప్తిమంతమై
యాగమ దర్శితంబగుచు నక్షరకీర్తుల నందుచుండ వై
భోగములంతటన్ గలుగు భూరి సుఖంబులు నీదురాకచే.

ములై సర్వశుభంబు లెల్లెడల సాకారంబులై యుండగా
సమతాభావము దీప్తిమంతమగుచున్ సర్వత్ర సత్కార్యముల్
మమతావృద్ధి సుభానులో జరిగి సన్మార్గానువృత్తంబు చే
సుమనస్తుల్యత గల్గి భారతము తేజోవంతమై వెల్గుతన్. 

నయులు, తండ్రులున్, బహుళధర్మసువర్తనులన్నదమ్ములున్,
మనుమలు, తాతలున్ మరియు మాతలు, బిడ్డలు, బంధులంత తా
మనవరతంబు సౌఖ్యములనామయసంపద లీ సుభానులో
వినయవిధేయతల్ గలిగి విస్తృతకీర్తుల నందగా వలెన్. 

మునులకు మోక్షకాంక్షులకు మోదము నిచ్చు ధరాతలమ్మునం
దనవరతంబు యజ్ఞములు, యాగములాదులు, ధర్మకార్యముల్
ఘనమగు సాధుసేవలు, సుకర్మము లిచ్చట నీ సుభానులో
మునుపటి వోలె సాగవలె, ముక్తి కరస్థము గావలెన్ సదా. 

శ్రీ "వ్యయ" నామ సంవత్సరాది సందర్భముగా
"శ్రీ వ్యయకు స్వాగతము"
పద్యరత్నములు
ఆ.వె.  
శ్రీలు పొంగ వలయు, మేలైన సస్యముల్
పండి భారతాన బహుళయశము
లందు చుండ వలయు, "వ్యయ" వత్సరంబందు
స్వాస్థ్యవర్ధనంబు చక్కగాను. 
కం.
"వ్యయ" వత్సర మీ విద్యా
లయమందలి వారికెల్ల లాలిత్యంబున్
నయవర్తన మనునిత్యము
సుయశంబుల నొసగుగాత సుందరమగుచున్.
తే.గీ.
త్న మొనరింప విద్యార్థి కధిక ఫలము
లబ్బు టదియేమి యాశ్చర్యమసలె గాదు,
కాన శ్రమియించి "వ్యయ" మందు గాంచ వలయు
నిర్మలంబైన ఫలములు నికషలందు. 
ఆ.వె.
కుంభవృష్టి గురిసి కువలయమందంత
జలసమృద్ధిచేత బలము నంది
సస్యవృద్ధి మరియు సత్సంపదలు గల్గి
భరతభూమి వెల్గు "వ్యయము" నందు.
ఆ.వె.
స్వార్థ పరత వీడి సత్కార్యకరణంబు
నుత్సహించి మనగ నుర్వియంత
స్వర్గతుల్యమౌచు సంపూర్ణసద్యశో
వైభవంబు నందు "వ్యయము" నందు. 
ఆ.వె.
ణుతి కెక్కు గాత! కల్మషరహితమై
కర్మభూమిలోన ఘనత నంది
కూర్మి నిండ ఛాత్రగురుజనబంధంబు
లమలయశమునంది "వ్యయము"నందు.
ఆ.వె.
నివి నంద వలయు ధర్మకార్యంబుల
భవ్యచరిత గల్గు భరత భూమి
మనుజులందు జూడ మమతానురాగాల
వైభవంబు నిండ "వ్యయము"నందు.
ఆవె.
ముదముతోడ జనులు సదమల హృదయులై
స్వాగతించ జనిరి "వ్యయము"నిలకు
పావనంబులైన పంచాంగ పఠనాల
నంబరంబు నంటు సంబరాల. 

"శ్రీ సర్వజిన్నామ"  సంవత్సరాది సందర్భముగా
మంగళాశాసనము
శ్రీ సర్వ జిత్తు ఉ గా ది శు భా కాం క్ష లు)
(కందములు)

శ్రీకరమై సచ్ఛుభముల
కాకరమై "సర్వజిత్తు" హర్షప్రదమై
లోకంబుల సుఖశాంతుల
నేకాలము భాగ్యరాశులీనగ వలయున్. 

సర్వదినంబులు నికపై
పర్వంబులబోలవలయు, బహువిజయాలన్
"సర్వజి"దాగమనంబున
నుర్వీతలమంత వెల్గుచుండగ వలయున్. 

జిత్తులు లేకుండగవలె
నెత్తెరగున జనములెల్ల రిమ్మహిలోనన్
మెత్తని వర్తనములతో
విత్తంబుల నందవలయు విస్తృతరీతిన్.

ర్వీతలమందన్నిట
సర్వోచ్చపదంబు నంది సమతామమతల్
"సర్వజి"దాగమనముచే
పర్వంగావలె పవిత్ర భారతమందున్.

గాదెలు నిండంగా వలె
మేదిని జలపూర్ణగాగ, మేలగు రీతిన్
మోదంబున జరగాలిట
వేదోక్త సుకర్మలన్ని విస్తారముగాన్. 

దినదినవృద్ధిని భారతి
ఘనయశముల నందవలయు, కన ఛాత్రులలో
వినయము నిండంగావలె
ననయంబును "సర్వజిత్తు"హాయనమందున్. 

శుభకరమౌచున్ "సర్వజి"
దభయాత్మకమౌచు గూర్చు నఖిల జగానన్
విభవంబులు, సుస్థిరసత్
ప్రభుతను మన భారతాన బంధురఫణితిన్. 

భావంబున నైర్మల్యము
దైవిక మగు శక్తి గూడ తగ భారతియున్ 
వేవేల విజయలక్ష్ముల
నేవేళను పొందవలయు, నీయబ్దమునన్. 

కాంతులతో నలుమూలల
శాంతులతో "సర్వజిత్తు" సాగగవలయున్
సంతోషంబున జగమిక
సుంతైనా బాధలేక శోభిల్లవలెన్. 

క్షరమందంగా వలయును
ధరనిండిన కుత్సితాలు, ధన్యాత్మకులై
యరమర లేకుందురు సో
దరభావంబంది జనులు  ధర్మానుగులై.

లుప్తంబౌ నఘమికపై
ప్రాప్తములౌ నబ్దమంత బహుళ యశంబుల్
వ్యాప్తంబౌ సద్ధర్మం
బాప్తతతో మెలగుచుండ నఖిల జగంబుల్. 

ప్రతిసారీ సంవత్సరం మారుతూనే ఉంది. ఉగాది వస్తూనే ఉంది. దానితోపాటు దేశంలో "అవినీతి, అన్యాయం, అధికధరలు, దేశద్రోహం, తీవ్రవాదం, వివిధరకాలైన రుగ్మతలు" ఇత్యాది సమస్యలు పెరుగుతున్నాయే తప్ప తరగటం లేదు. ప్రతిసారీ శుభాకాంక్షలు తెలుపుకోవటమే తప్ప నిజమైన శుభం అనుభవంలోకి రావటం లేదేమో అనిపిస్తోంది.  ఐనా క్రొత్తసంవత్సరం రాక మానదుగదా! ఐతే ఇటువంటి స్థితిలో మరో క్రొత్తసంవత్సరానికి సంతోషంగా స్వాగతం పలకడం అనుచితమనిపించటం చేతనే
"శ్రీ సర్వ జి తు న కు స్వా గ త మే ల"
(సర్వజిత్తునెట్లు స్వాగతింతు)
(ఆటవెలదులు) 
శ్రీలు పొంగి పొరలు చిత్కళావాసమై
భవ్యయశము గాంచు భరతభూమి
స్వార్థపరుల వలన వాసిని గోల్పోయె
సర్వజిత్తునెట్లు స్వాగతింతు? 

సర్వ జగతిలోన దుర్వార రుగ్మతల్
వ్యాప్తిజెంది జనులు వణకుచుండ 
వెతలు పెరిగి పోయె, బ్రతుకు భారంబయ్యె 
సర్వజిత్తునెట్లు స్వాగతింతు? 

జిగటవోలె నంటె జగతిలో నవినీతి
లంచగొండితనము మించి పోయె
పేదవాని బ్రతుకు వేదనామయమయ్యె
సర్వజిత్తునెట్లు స్వాగతింతు? 

తులన కందకుండె దుర్మార్గకృత్యముల్
మమత శూన్యమయ్యె మైత్రిలోన
కుత్సితంబు పెరిగె కువలయంబంతట
సర్వజిత్తునెట్లు స్వాగతింతు? 

యము భయము లేక నమ్మి నిల్పినవారి
నమ్మకాలనన్ని వమ్ము చేసి
భక్షణంబు చేయు పాలకులుండంగ
సర్వజిత్తునెట్లు స్వాగతింతు? 

కువలయంబులోన నవనవోన్మేషమై
తీవ్రవాద మెంతొ తేజరిల్లి
మానవత్వ పదము మటుమాయమైపోవ
సర్వజిత్తునెట్లు స్వాగతింతు? 

స్వాంతశుద్ధి లేదు సాధుత్వమదిలేదు
మమత జూత మన్న మలిన యుతము
సమత శూన్యమయ్యె సర్వత్ర జగతిలో
సర్వజిత్తునెట్లు స్వాగతింతు? 

తిని తప్పు చుండె ఘనతను కోల్పోయి
దేశపాలనంబు స్థిరత లేక
నిధులభక్షణంబె విధి పాలకులకయ్యె
సర్వజిత్తునెట్లు స్వాగతింతు? 

ల్లి, తండ్రి కంటె తనవారి కంటెను
సాటి వారి కంటె సఖుల కంటె
ధనమె సర్వమయ్యె జనుల కీకాలాన
సర్వజిత్తునెట్లు స్వాగతింతు? 

మేను నిల్చు టెట్లు మేటి భారతమందు
ఖాద్యవస్తు ధరలు క్రమత లేక
నిత్యవృద్ధితోడ నింగి నంటుచునుండ
సర్వజిత్తునెట్లు స్వాగతింతు? 

లనకేది స్వేచ్ఛ యిలకె మూలము తాను
భవ్యభూమి యైన భారతాన
షష్ఠిపూర్తి యయ్యె స్వాతంత్ర్యలలనకు
సర్వజిత్తునెట్లు స్వాగతింతు? 

సర్వధారి ఉగాది సందర్భముగా
"శ్రీ సర్వ ధా రీ స్వా గ త ము"
(కందపద్యములు)

శ్రీకరమై సచ్ఛుభముల
కాకరమై సర్వధారి యతి సుందరమై
లోకంబున సుఖశాంతుల
నేకాలము నింపవలయు నింపలరంగాన్.  

సర్వాభ్యుదయము గావలె
నుర్విని సద్భావగంధ ముప్పొంగ వలెన్
పర్వంగావలె నంతట
సర్వైక్యంత్వంపు దీప్తి సాధుత్వంబున్. 

ధార్మిక, బహువిధవైదిక
కర్మంబులు "సర్వధారి" కాలమునందున్
కూర్మిని జరుగంగా వలె
కార్మికులకు సౌఖ్యవృద్ధి గావలె నిలలో.

రీతులు మారంగా వలె
నైతిక వర్తనము తోడ నరులన్నింటన్
ఖ్యాతిని గాంచంగా వలె
భూతలమున నెల్లవేళ  పూర్ణాయువుతోన్.

స్వాదు జలంబుల వృష్టులు
మోదమునం గురియవలయు, మీదట సస్యాల్
మేదిని పండంగా వలె
కాదనకీ "సర్వధారి" కాలమునందున్. 

తవత్సరమున దొరలిన
వెతలన్నియు దీరవలయు, విస్తృత సుఖముల్
సతతము గలుగంగా వలె
నతివేగము "సర్వధారి" హాయనమందున్. 

నువున స్వస్థత గూడుచు
మనసున నైర్మల్యవృద్ధి మరియటుపైనన్
వినయము నిండంగా వలె
ఘనముగ నీ "సర్వధారి" కాలము నందున్. 

ముదమది గూడగ వలయును
సదమల భావంబు గల్గి సచ్ఛీలతతో
హృదయము నిండంగావలె
పదిలముగా "సర్వధారి" వత్సరమందున్. 

సర్వధారి ఉగాది సందర్భముగా
"శ్రీ సర్వ ధా రి వ చ్చి చ క్క ని లి చె" 
ఆటవెలది పద్యములు

శ్రీలు పెంచ గోరి, చిరసౌఖ్యమీగోరి
శాంతి నింప గోరి జగతిలోన
సమత బంచ గోరి, సచ్ఛుభములీగోరి
సర్వధారి వచ్చి చక్క నిలిచె.

సర్వ జగతిలోన  సస్యానుకూలిత
వృష్టిగూర్చి, ధాన్య పుష్టి గూర్చి
సకల జనుల కింక సంతుష్టి గూర్చంగ
సర్వధారి వచ్చి చక్క నిలిచె.

ధార్మికత్వవృద్ధి ధరనిండ జూపంగ
ఆస్థ బెంచి జనుల కఘము ద్రుంచ
మనములందు నున్న మాలిన్య మడగించ
సర్వధారి వచ్చి చక్క నిలిచె.

రిపుల నణచివేసి విపులమౌ యశమిచ్చి
స్వాస్థ్యవర్ధనంబు సాగజేసి
(చింతలన్ని)వంతలన్ని దీర్చి సంతోషమందించ
సర్వధారి వచ్చి చక్క నిలిచె.

సుధలోన నుండు బహుజీవకోటికి
ఐక్యతానుభూతి నందజేసి
కులము లేకమంచు కూర్మిని నింపంగ
సర్వధారి వచ్చి చక్క నిలిచె.

చిత్తశుద్ధి జూపి చింతల దీర్చుచు
తనువు తనువులోన దయను బెంచి
విమల దాతృభావ విస్తృతి గూర్చంగ
సర్వధారి వచ్చి చక్క నిలిచె.

నిన సర్వజిత్తు సంవత్సరంబున
గల్గినట్టి యఖిల కష్టతతుల
గూల్చివేసి సుఖముగూర్చంగ తానిప్డు
సర్వధారి వచ్చి చక్క నిలిచె.

నుడు దాతృగుణము, కర్మఠత్వము పైని
భూతదయయు, శాంతి పుడమిలోన
నింపి స్నేహదీప్తి పెంపొంద జేయంగ
సర్వధారి వచ్చి చక్క నిలిచె.

నిఖిల జనులలోన నిస్స్వార్థభావంబు
సాటివారియందు మేటి (ప్రేమ) నెనరు
సకలదేశములకు సఖ్యత గూర్చంగ
సర్వధారి వచ్చి చక్క నిలిచె.

లిప్తలోన గూలి సుప్తమైపోయెడి
దేహగుణము దెల్పి, తిరము వెల్గు
ధర్మమార్గమునకు ధరవారి మరలింప
సర్వధారి వచ్చి చక్క నిలిచె.

చెంత చేరినట్టి చిరకాల రిపునైన
నాదరించి ప్రేమ నందజేసి
కాచుసాధుజనుల ఘనతను చాటంగ
సర్వధారి వచ్చి చక్క నిలిచె.


శ్రీపార్థివ నామ సంవత్సర ఉగాది సందర్భముగా 
శ్రీపార్థివకు స్వాగతము. 

శ్రీల నొసగు బుద్ధి చిన్మయ రూపియై
పక్షమాసరాశి ఫలము లెన్నొ
ధరణి బంచు కొరకు తనవెంట నిడుకొని
వత్సరంబు వచ్చె పార్థివాఖ్య. 

పార్థివాఖ్య తోడ పంచాంగ పఠనాలు
నింబ కుసుమ తింత్రిణీ యుతంపు
మిశ్రమంబు గూడి మేదిని కేతెంచు
వర్షరాజ! నీకు స్వాగతమ్ము

సుధలోన జాతి వైషమ్యములు పోయి
సుఖములందవలెను సోదరులయి
విజయ పథము నందు విహరించ వలెనెందు
భారతీయులింక పార్థివాన. 

కుమతీ సంహరణంబులు
సమతా భావంపు వృద్ధి చక్కని కృతులున్
సుమతీ సంవర్థనములు
భ్రమకాదని చూపుమోయి పార్థివ! నీవున్.

స్వాదు జలముతోడ చక్కని వర్షాలు
కురిసి పొలములెల్ల విరగబండి
సుఖము సంతసంబు లికపైన గల్గాలి
భారతంబు లోన పార్థివాన.

తిదప్పిన సత్కార్యము
లతివేగము పూర్వవృద్ధి నందగ వలయున్.
మితిమీరిన దుష్కృతులిక
పతనంబును పొంద వలెను పార్థివ! మందున్.

నయులు, తల్లులు, దండ్రులు
తనవారలు, జాతివారు, ధరనుండు ప్రజల్
మనమున మైత్రిని నింపుక 
ఘన పార్థివమందు గూడి  కనవలె సుఖముల్. 

ముదము తోడ నెపుడు సదమల హృదయులై
ఛాత్రగణము లింక చదువుకొనుచు
వినయవర్తనాన విస్తృత యశములు 
గాన వలెను పార్థివాన భావి. 

 
2003, ఆంగ్ల వత్సరాది సందర్భంగా
(జ.న.వి.వెన్నెల వలస, శ్రీకాకుళం)
ఆ.వె.
సవ్య గుణములబ్బి, జనముల మనముల
సత్యదీప్తి గలిగి సమత మమత
నిండి కలుగ వలయు నిత్యంబులైనట్టి
వైభవంబు లాంగ్ల వత్సరాన. 
ఆ.వె.
జాతులేక మగుచు జాతీయతాభావ
మఖిలభారతాన నావహించ
శాంత జీవనంబు జరుపంగ లెనింక
ఆంగ్లవత్సరాన నఖిలజనులు. 
కం.
హృద్యానవద్యమయ్యెడు
సద్యోజ్ఞానంబు గల్గి  ఛాత్రుల కికపై
విద్యాభివృద్ధి గలుగుచు
విద్యాలయ గౌరవంబు వెలుగొంద వలెన్. 
ఆ.వె.
ఛాత్రగణము కెపుడు చక్కని విజయాలు
గురుజనంబు కెల్ల సిరులు యశము
కలుగుచుండవలయు ఘనముగా శుభములు
ఆంగ్లవత్సరాన నందరకును. 
కం.
జవహర్ నవోదయంబున
నివసించెడు జనులకేను నిర్మల హృదితో
నవవర్షారంభమునను
సువచస్సుల నందజేతు శుభకామనలన్. 


2002, ఆంగ్ల వత్సరాది సందర్భంగా
(జ.న.వి.వెన్నెల వలస, శ్రీకాకుళం ప్రాచార్యుల నుద్దేశించి)
ఉ. 
శ్రీదులు సర్వకామదులు చిన్మయరూపులు శంకరుండు దా
మోదర వాగధీశ సురముఖ్యులు నిందిర గౌరివాణులున్
మేదిని నిండు కీర్తులను మీకిక నూతన వత్సరంబునన్
మోదము నంద నిత్తురిక మువ్వురుమూర్తులు శోభనంబుగాన్. 
కం.
నవవత్సర శుభకామన
లవనత మస్తకుడనగుచు నార్యా! మీకున్
సవినయ సద్భావంబుల
కవనంబుల నంద జేతు ఘనముగ నేడున్. 
ఆ.వె. 
ఆంగ్ల వత్సరాన ననుపమ సౌఖ్యముల్
గలుగుగాత! మీకు, ఘనముగాను
సాధు యశము మరియు సమ్యగారోగ్యంబు
భాగ్యవర్థనంబు భవుని కరుణ. 
కం.
ఈవత్సరమందంతయు
భావింపగ విజయవృద్ధి భవ్య సుఖంబుల్
శ్రీవైభవ శుభకామన
లావరదుండొసగు మీకు హరి మోదము తోన్. 
తే.గీ.
అమలదశదిశావిశ్రాన్త యశముతోడ
ఆయురారోగ్యవర్ధన మగుచు నుండి
భోగ భాగ్యంబు లిలలోన వేగమబ్బ
హర్ష మొప్పంగ పూర్ణాయువంది మనుడు. 


2003  నూతనసంవత్సరారంభ సందర్భముగా 
ప్రాచార్యులు, జ.న.వి. వెన్నెలవలస (శ్రీ ముళ్ళపూడి కోటేశ్వరరావు గారు)వారికి 
శుభాకాంక్షలందిస్తూ వ్రాసిన పద్యములు
(కందములు)
శ్రీ ముళ్ళపూడి వంశజ!
కామితములు దీర్చి బ్రోచు ఘనముగ మిమ్మున్
దామోదర కమలాసను
లామృడు డీ వత్సరాన నతివత్సలతన్.

నవవత్సర శుభకామన
లవిరళ సద్యశము సిరులు నారోగ్యంబున్
భువనైక రక్షకుండగు
శివుడొసగును గాత మీకు సిద్ధం బికపై.

ఈ వత్సరమందంతయు
భావింపగ విజయవృద్ధి భవ్య సుఖంబుల్
శ్రీవైభవ శుభకామన
లావరదుం డొసగుగాత హరి మోదమునన్.

శ్రీ సాయినాథుకరుణయు
భాసిల్లెడు వేంకటేశు పావన దృక్కుల్
మీసాధు వర్తనంబున
వాసంబును జేయుగాత వైభవ మొప్పన్.

శుభములె గల్గగ వలయును
విభవంబుల నందవలయు విస్తృత బుద్ధిన్
సభలందు సాధుయశములు
సుభవా! కోటేశ్వరార్య! చూడగ వలయున్.

  
 "సంక్రాంతి"(వృష వత్సరము)
సీ.
సింగా మొలికించు రంగవల్లులతోడ
          ముంగిళు లెల్లెడ ముద్దులొలుక
రంగైన వస్త్రాల గంగిరెద్దులు గూడి
          నంది రూపంబులై నాట్యమాడ
మూడు సందెలలోన ముదముతో జంగమ
          లఘవిదూరకుడైన హరుని గొలువ
చూతంపు పత్రాల శోభిల్లు మాలలు
           ద్వారబంధములందు సౌరులొలుక
ఆ.వె.
మకర రాశిలోన మార్తాండు డేతెంచు
సమయ మందు మిగుల శ్రద్ధతోడ
భూసురోత్తములకు భూరిదానంబులు
చేయవలయు మోక్షసిద్ధి కొరకు. 
కం.
హర! శంకర! భవహర! యని
హరిదాసుం డేగుదెంచి  యఘనాశకుడౌ
హరునామము జపియించుచు
కరయుగ్మము మోడ్చి నిల్చె ఘన సంక్రాతిన్.
కం.
హరిహర రూపుం డీతడు
నిరతము తన్నామ జపము నియముతోడన్
మరవక చేయు నటంచును
హరిదాసుకు భిక్షనిడిరి యతివలు భక్తిన్
ఆ.వె.
అయ్యవార్కి మ్రొక్కు మమ్మగారిని చూడు
నయము భయము తోడ నాట్యమాడు
మనుచు గంగిరెద్దు లాడించు చుండగా
గనిరి బాలురపుడు కాంక్షదీర.
కం.
రంగైన రంగవల్లులు
ముంగిళ్ళను వెల్గుచుండ మోదము తోడన్
సింగారించిరి గృహములు
సంగీతాదులను మకర సంక్రమణానన్.(సంక్రమమందున్)
ఆ.వె.
పెక్కురకములైన కుక్కుటంబుల నిల్పి
కాళ్ళమధ్యలోన కత్తిగట్టి
జరుపుచుండి రౌర! సంక్రాంతి వేళను
కోళ్ళపందె మచట కోర్కి మీర. 
ఆ.వె.
అస్మదీయమైన యౌన్నత్యమును జూడు
డవని మేమె గాదె యధికులమని
నొక్కి చెప్పదలచి కుక్కుటంబుల దెచ్చి
పోరు గూర్చు చుంద్రు పౌరు లెల్ల.
కం.
ధనధాన్య సువర్ణంబుల
ననయము కూశాండదాన మఘ సంహృతికై
ఘనమగు సంక్రమణంబున
వినుడిల జనులొసగగలరు విప్రుల కెపుడున్. 


 


 
 





10 comments:

  1. మూర్తి గారు,
    ప్రశంసనీయమైన కూర్పు. అభినందనలు.
    నదులలో మనుజులలో నిండియుండవలసిన వాటి గురించి చక్కగా ప్రస్తావించారు.
    ఆరవ (స్వా) పద్యములో రెండవ పాదములో యతిని గురించి కొంచెం పరిశీలించాలి.

    ReplyDelete
    Replies
    1. మందాకిని గారికి,
      నమస్కారములు,
      మీ అభినందనలకు, సూచనలకు ధన్యవాదములు,
      "న్యాయము ధర్మంబు సత్త్వమంతట నిండున్"అను పాదములోని యతినిగురించి ప్రస్తావించారు.
      దీనిలో దశవిధయతులలోని "సంయుక్తాక్షరయతి" నియమానుసారము "న్యా" లోని "య"కారము గ్రహింపబడినది. పిమ్మట "సరసయతి" నియమానుసారము "య"కారమునకు "అంతట"లోని "అ"కారముతో మైత్రి పాటించబడినది(అ,య,హ-లకున్న పరస్పరమైత్రి వలన).
      ధన్యవాదములతో-మూర్తి.

      Delete
  2. ధన్యవాదాలండి విశదీకరించినందుకు.
    నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నానండి.
    నాకు అలా అనిపించినది సరియాకాదా తెలుసుకునేందుకు పరిశీలించాలనుకున్నాను. మీరు నా సందేహం తీర్చినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. చాలా బాగున్నాయండీ! మీకు కూడా నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
  4. శ్రీ సత్యం గారికి ధన్యవాదాలు
    చాల విపులముగా అందరకి అర్ధం అయ్యేలా రాసారు.

    తెలుగు బాష మీద మక్కువ మెండు
    కాని ఛందస్సు అంటే భయం వాళ్ళ ఎక్కువ
    పట్టులేదు.అర్ధము,ప్రతిపదార్ధం చెప్పగాలును
    కాని అంత పట్టు లేదు

    ReplyDelete
  5. పూర్వఫల్గునిగారూ,
    ధన్యవాదాలు.

    ReplyDelete
  6. శ్రీ సత్యం గారికి నమస్కారములు.

    ఈ రోజు "శంకరాభరణం"లో మీ సమస్యాపూరణ కౌశలిని చూశాను.

    ఉత్తర భారతదేశంలో తెలుగు భాషావ్యాప్తికి సఫలకృషి చేస్తుండటమే గాక ఈ విధంగా మీరు పద్యవిద్యను స్వాయత్తీకరించికోవటం నాకెంతో సంతోషాన్ని కూర్చింది.

    మీ రచన భాగున్నది.

    మీ దీక్షాఫలంగా అచిరకాలంలోనే మీ ఊరి పాఠశాల తెలుగు తోటలోని మొగ్గలన్నీ పువ్వులై విరబూసే ఋతువు రాగలదని, ఆ పరిమళం మీ కవిత్వానికి వెలుగు చూపుతుందని నమ్ముతున్నాను.

    శుభాకాంక్షలతో,
    ఏల్చూరి మురళీధరరావు

    ReplyDelete
    Replies
    1. శ్రీ మురళీధరరావు గారూ,
      ధన్యవాదాలండీ,
      శ్రీనందన నామ సంవత్సర శుభాకాంక్షలు.

      Delete
  7. Murthi garu,
    I would like to contact you regarding Telugu. my mail ID: latpro@gmail.com. I stay in Delhi

    -MV Narayana

    ReplyDelete