జై భారత్ జై జవాన్
సైనికాభినందన
కందములు
అభినందన లందుము నీ
వభినందన! సాహసించి యత్యుత్తమమౌ
శుభకార్యము చేయుటచే
సభలందున నీదుకీర్తి చర్చకు వచ్చెన్. 1.
అరివర్గంబుల కందియు
నరయగ ధైర్యంబు చూపి యాత్మావనికై
నిరుపమగతి సహియించితి
వురుతరసద్యశము లొదవె నుర్విని నీకున్. 2.
జనియించిన దేశంబున
కనయము సౌఖ్యంబు గూర్చనగు కార్యంబే
ఘనమని శౌర్యము జూపితి
వనుపమ మది సత్యమంచు నభినందింతున్. 3.
మనదేశపు సత్వంబుల
ననుచితగతి నడచునట్టి యరిసంఘములం
దనయంబును జూపించగ
నని దుముకు జవానులార! యభినందింతున్ 4.
జైజై భారత మంచును
జేజేలు సతంబు బల్కి చెనటుల హృదులం
దాజీవన సంత్రాసం
బాజిని గలిగించు వీరు నభినందింతున్. 5.
ధనధాన్యరాశి కన్నను
తన సౌఖ్యము కన్న మిన్న తన జన్మభువిన్
ఘనతరముగ రక్షించుట
యనుకొను సైనికుని నిత్య మభినందింతున్. 6.
నీవసుమతి గని సైనిక!
యీ విశ్వములోన దౌష్ట్య మేర్పడునట్లున్
భావన జేసెడి వారల
కావంతయు జంకకుందు వభినందింతున్. 7.
నీవే రక్షణ సేతువు
నీవే సౌఖ్యంబు లిందు నిర్మలమతితో
దైవంబు వోలె గూర్చెద
వావిధి వర్ణింప దరమె యభినందింతున్. 8.
జేజే భారతమాతా!
జేజే హే కర్మభూమి! జేజే జననీ!
జేజే సైనికవీరా!
జేజే హే త్యాగమూర్తి! జేజే లిచటన్. 9.
ధన్యుండ వీవు సైనిక!
ధన్యత్వమునందె భరతధాత్రియు జూడన్
మాన్యుండవైన నిన్గని
యన్యం బికయేల నోయి యభినందింతున్. 10.
హ.వేం.స.నా.మూర్తి.
01.03.2019.
సైనికాభినందన
కందములు
అభినందన లందుము నీ
వభినందన! సాహసించి యత్యుత్తమమౌ
శుభకార్యము చేయుటచే
సభలందున నీదుకీర్తి చర్చకు వచ్చెన్. 1.
అరివర్గంబుల కందియు
నరయగ ధైర్యంబు చూపి యాత్మావనికై
నిరుపమగతి సహియించితి
వురుతరసద్యశము లొదవె నుర్విని నీకున్. 2.
జనియించిన దేశంబున
కనయము సౌఖ్యంబు గూర్చనగు కార్యంబే
ఘనమని శౌర్యము జూపితి
వనుపమ మది సత్యమంచు నభినందింతున్. 3.
మనదేశపు సత్వంబుల
ననుచితగతి నడచునట్టి యరిసంఘములం
దనయంబును జూపించగ
నని దుముకు జవానులార! యభినందింతున్ 4.
జైజై భారత మంచును
జేజేలు సతంబు బల్కి చెనటుల హృదులం
దాజీవన సంత్రాసం
బాజిని గలిగించు వీరు నభినందింతున్. 5.
ధనధాన్యరాశి కన్నను
తన సౌఖ్యము కన్న మిన్న తన జన్మభువిన్
ఘనతరముగ రక్షించుట
యనుకొను సైనికుని నిత్య మభినందింతున్. 6.
నీవసుమతి గని సైనిక!
యీ విశ్వములోన దౌష్ట్య మేర్పడునట్లున్
భావన జేసెడి వారల
కావంతయు జంకకుందు వభినందింతున్. 7.
నీవే రక్షణ సేతువు
నీవే సౌఖ్యంబు లిందు నిర్మలమతితో
దైవంబు వోలె గూర్చెద
వావిధి వర్ణింప దరమె యభినందింతున్. 8.
జేజే భారతమాతా!
జేజే హే కర్మభూమి! జేజే జననీ!
జేజే సైనికవీరా!
జేజే హే త్యాగమూర్తి! జేజే లిచటన్. 9.
ధన్యుండ వీవు సైనిక!
ధన్యత్వమునందె భరతధాత్రియు జూడన్
మాన్యుండవైన నిన్గని
యన్యం బికయేల నోయి యభినందింతున్. 10.
హ.వేం.స.నా.మూర్తి.
01.03.2019.
No comments:
Post a Comment