శ్రీ మన్మథనామ సంవత్సరము
శా. శ్రీమన్మన్మథనామవత్సరము సత్శ్రేయంబులన్ గూర్చుచున్
క్షేమం
బెల్లజనాళి యుండుకొరకై శ్రీలన్ ప్రసాదించుచున్
ధామంబై
సువిశాలసౌఖ్యతతికిన్, ధర్మంపు సంస్థానమై
భూమిన్
కూర్చు శుభంబు లెల్లగతులన్ భోగంబులందించుచున్.
శా. విద్యాభ్యాసము చేయుచుండి సుమహద్విజ్ఞాన సంపన్నులై
విద్యార్థుల్
వినయాదిసద్గుణములన్, విస్తారసద్భావముల్
సద్యస్స్ఫూర్తి
యు మన్మథాబ్దమున ధీశక్తిన్ సదౌన్నత్యమున్
హృద్యంబౌనటు
లందగావలె నిలన్ హృష్టాత్ములై నిత్యమున్.
శా. నవ్యాంధ్రంబున సంపదల్ కురియుచున్ న్యాయప్రసారంబునన్
దీవ్యద్వైభవదీప్తు
లన్నిదిశలన్ దేదీప్యమానంబులై
భవ్యంబౌవిధి
విస్తరించవలయున్ బాగైన సస్యంబు లీ
నవ్యాబ్దంబున
మన్మథాన
కలుగన్ నానాప్రకారంబుగాన్.
శా. ఆనందంబిడు
రాజధాని కిపుడీ యాంధ్రావనీ రాష్ట్రమం
దేనాడు
న్విననట్టి రీతి కనగా నీ మన్మథాబ్దంబునన్
మానం
బెల్లెడ చాటునట్టులుగ నిర్మాణంబు సాగన్వలెన్
దానన్
సోదరరాజ్యవాసు లకటా! ధైర్యాఢ్యు లీరంచనన్.
శా. మాసాలున్ ఋతుషట్క మాయయనముల్ మాన్యంబులౌ పక్షముల్
వాసింగన్నతిథుల్
సమస్తకరణాల్ వారంబులున్ యోగముల్
గాసింగూల్చెడు
తారలున్ వివిధ లగ్నంబుల్ కనన్ రాశులున్
ధ్యాసన్నిల్పుచు
మన్మథాబ్దమున సత్సాంగత్యమున్ గూర్చెడున్.
No comments:
Post a Comment