Thursday, 23 January 2014

అక్కినేని

ఎవ్వాని సౌందర్య మీయాంధ్రదేశంబు
..........తిలకించి పులకించె నలఘుకాల
మెవ్వాని నటనలో, నింపైన పలుకులో
..........నవరసంబులు చిందు నవ్యగతుల
నెవ్వాని కృషిచేత నీచిత్రసీమకు
..........భాగ్యనగరమిందు యోగ్యమయ్యె
ఎవ్వాని నడతలో నేకోణమున జూడ
..........వినయదీప్తులజ్యోతి వెలుగుచుండు
అతడు నాగేశ్వరుండు మహానటుండు
ఘనుడు సమ్రాట్టుగా కీర్తి గాంచి నటన
నాంధ్రదేశాని కనుపమయశము గూర్చె
నక్కినేనికి శ్రద్ధతో నంజలింతు.

No comments:

Post a Comment