ది. 17.09.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో పద్యరచన శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన పద్యవ్యాఖ్య
యమరాజును సకలాఘము
శమియింపగ భక్తితోడ సన్నుతి చేతున్
సమవర్తిని మది దలచెద
నమలిన సద్యశము లొసగ ననవరతంబున్.
సత్వదీప్తితోడ సర్వకాలములందు
ధర్మ మించుకైన దప్పకుండ
సకలజీవములకు శాశ్వతానందంబు
కలుగజేయుచుండు ఘనుడితండు.
దివ్యతేజ మంది దిక్పాలకుండౌచు
దక్షిణాశ జేరి ధరణి నెపుడు
కరుణ జూపుచుండి కాపాడు వానిని
శమను దండధరుని సన్నుతింతు.
No comments:
Post a Comment