నూతనసంవత్సర(౨౦౧౫) శుభకామనలు
ఆ.వె. శ్రీల నందవలయు
చిరకాలవాంఛలీ
నూత్నవత్సరాన యత్నమునను
చేతమలరునట్లు సిద్ధించవలెగాత
క్రమత మీకటంచు కాంక్షజేతు ౧.
ఆ.వె. స్వాస్థ్యవర్ధనంబు
చక్కగా నుండుచు
సంతసంబు గలిగి సతత మొదవు
నూతనాబ్దమందు నూతనోత్సాహంబు
క్రమత మీకటంచు కాంక్షజేతు ౨.
ఆ.వె. ఇనుమడించు
దీప్తి యీవత్సరంబంత
అందుచుండవలయు ననుపమముగ
సద్యశంబు లొసగు సత్కార్యములచేత
క్రమత మీకటంచు కాంక్షజేతు ౩.
ఆ.వె. సర్వదిశలలోన
సంవత్సరంబంత
విజయ
మొసగునట్లు విస్తృతముగ
నలముచుండ
వలయు ననుకూలపవనాలు
క్రమత మీకటంచు కాంక్షజేతు ౪.
ఆ.వె. మీకుటుంబ
మందు మిగుల హర్షంబబ్బి
బందుజనులసంగ వైభవంబు
క్రొత్తవత్సరాన కూడంగవలె గాత
క్రమత మీకటంచు కాంక్షజేతు ౫.
ఆ.వె. సన్నుతించదగిన
సద్భావభాగ్యంబు
శుభము లొసగునట్టి సూక్తిపంక్తి
కార్యకరణశక్తి కలుగు నీయబ్దాన
క్రమత మీకటంచు కాంక్షజేతు ౬.
ఆ.వె. జగతివారలంద
రగణిత సౌఖ్యంబు
లందవలయు ననెడు సుందరమగు
భావ
మీయ వలయు భగవంతు డీయేడు
క్రమత
మన కటంచు కాంక్షజేతు ౭.
ఆ.వె. దేశభక్తి మరియు దివ్యానురాగంబు
సాటివారిపట్ల సవ్యమైన
ఆత్మసదృశభావ మందునీ యబ్దాన
క్రమత మనకటంచు కాంక్షజేతు ౮.
ఆ.వె. విజయనగర దివ్య విద్యాలయంబందు
విజయపంక్తి సతము విస్తరించ
హర్షమబ్బు నూత్నహాయనంబంతయు
క్రమత మన కటంచు కాంక్షజేతు. ౯.
ఆ.వె. హృద్యమైన రీతి విద్యార్థిలోకాన
వినయదీప్తి గలుగ ననయమిచట
సంతసంబు గూడు సంవత్సరంబంత
క్రమత మనకటంచు కాంక్షజేతు ౧౦.